తెలంగాణ

గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకుతిరుగుతున్న రెండో నిందితురాలు పార్వతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేసింది. తన కార్యాలయంలో పని చేసే మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రిమాండ్‌కు తరలిన అనంతరం రెండు సార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేస్తే కోర్టు తిరస్కరించింది. బుధవారం గజల్, పార్వతిల పిటీషన్లు కోర్టుకు ముందుకు రావడంతో వీరిద్దరికి బెయిల్ మంజూరు అయ్యింది.