తెలంగాణ

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల అభివృద్ధికి రెండో దశ ప్రాజెక్టులో భాగంగా రూ.100 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి వినియోగించాల్సి ఉం టుంది. అయితే ఈ పనుల్లో కేంద్రం 60 శాతం ఖర్చు భరిస్తుంది, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టుల సంచారం ఉన్న చాలా ప్రాంతాల నుంచి దూరంగా ఉన్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, జయశంకర్-్భపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో 97.58 కిలోమీటర్ల దూరం, 50 రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించారు. ఈ పనులను కేంద్రం అందించిన నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చుకుని చేపట్టాల్సి ఉంది. భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల్లో చింతగుప్ప, బూరుగుపాడు, ఎన్- కొత్తూ రు, చెలమల, దండుపేట, జగ్గుతండ, కోడిపుంజులు తండ, జయశంకర్-్భపాలపల్లి జిల్లాలో గంపోనిపల్లి, చినగంగారం, సుబ్బక్కపల్లి, మహబూబాబాద్ జిల్లాలో లక్ష్మతండ, చిన్నగొంగడి తండ, వాగ్యూత్ తండా, ఇప్పలతండ, వరంగల్ జిల్లాలోని బంచరాయ్ తండాలకు రోడ్డు ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాలకు అనుసంధానం చేయనున్నారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకానికి వర్తించే నియమ నిబంధనలే ఈ పథకానికి వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద చేపట్టే పనుల సమయంలో భద్రత కోణంలో చాలా కీలకంగా వ్యవహరించాలని కేంద్రం సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తన భద్రత ఏర్పాట్లు చేసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ అధికారులకు తెలియజేసింది.