తెలంగాణ

రోడ్డు భద్రతకు మారుపేరు టిఎస్‌ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: గతంతో పోలిస్తే టిఎస్‌ఆర్టీసిలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. సంస్థ అధికారులు రోడ్డు భద్రతపై తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం నాడిక్కడ టిఎస్‌ఆర్టీసి కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టిఎస్‌ఆర్టీసిలో సుధీర్ఘకాలం ప్రమాద రహితంగా బస్సు నడిపిన డ్రైవర్లకు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలుగుతూ తమను తాము రక్షించుకుంటూ ప్రయాణీకులను భద్రంగా గమ్యస్ధానాలకు చేర్చాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో బడ్జెట్‌లో వెయ్యికోట్లు కేటాయించారని తెలిపారు. పలు డిపోలు లాభాల బాట పట్టడం శుభపరిణామమని అన్నారు. క్షేత్ర స్ధాయిలో డిపో మేనేజర్లు, డివిఎంలు, ఆర్‌ఎంలు ప్రజల్లో ఆర్టీసి పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసి ఎండి జివి రమణారావు, ఆర్టీసి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రైవర్లు తమ సర్వీస్‌లో అత్యధిక కాలం ప్రమాద రహితంగా బస్సులు ఎవరైతే నడిపారో వారిని గుర్తించి ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ డ్రైవర్‌ర్లుగా ముగ్గురికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. కరీంనగర్-2 డిపోకు చెందిన మహ్మద్ అమీనుద్దీన్ రూ.12 వేల నగదు బహుమతి, ద్వితీయ స్ధానంలో కరీంనగర్-2 డిపోకి చెందిన ఎ.కృష్ణకు రూ.10 వేలు, మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బి.కేశయ్యకు రూ.8 వేలు, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో హైదరాబాద్1 డిపోకు చెందిన బి.రాములుకు రూ.4500, రెండవ బహుమతి కంటోనె్మంట్ డిపోకు చెందిన జెటి రెడ్డికి రూ.4250, మూడో బహుమతి జీడిమెట్ల డిపోకు చెందిన ఎస్.విఠల్‌కు రూ.4,000 నగదు బహుమతిని అందజేశారు. కరీంనగర్ జోన్‌లో ప్రధమ బహుమతిని నిర్మల్ డిపోకు చెందిన జహీర్ అహ్మద్‌కు రూ.4500, రెండో బహుమతిని సత్తుపల్లి డిపోకు చెందిన వి.బాబుకు రూ.4,250, నిర్మల్ డిపోకు చెందిన ఎన్.నాగేందర్‌కు రూ.4,000, హైదరాబాద్ జోన్‌లో నల్గొండి డిపోకు చెందిన మహ్మద్ జి.మొయినుద్దీన్‌కు ప్రధమ బహుమతిగా రూ.4500, రెండవ బహుమతిని మహబూబ్‌నగర్ డిపోలోని మహ్మద్ అబ్ధుల్‌కు రూ.4250, మూడవ బహుమతిని హైదరాబాద్ 2 డిపోకు చెందిన కె.జనార్థన్‌కు రూ.4 వేల నగదు బహుమతులు, ప్రశంశా పత్రాలు లభించాయి. అలాగే అతి తక్కువ ప్రమాదాలు నమోదైన డిపోలకు కూడా మూడు కేటగిరీలుగా అవార్డులను ప్రదానం చేశారు. కేటగిరి 1లో మంథని డిపోకి ప్రధమ బహుమతి రూ.18 వేల నగదు బహుమతి లభించగా, ద్వితీయ బహుమతి కొల్లాపూర్‌కు డిపోకి రూ.12,400 దక్కింది. అలాగే రెండో కేటగిరిలో పరిగి డిపోకు ప్రధమ బహుమతిగా రూ.26000, ద్వితియ బహుమతి పికెట్ డిపోకు రూ.17,200, కేటగిరి 3లో రాణిగంజ్ 2 డిపో ప్రధమ బహుమతిగా రూ.33 వేలు, ద్వితీయ బహుమతిని జీడిమెట్ల డిపోకు రూ.21,400 నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు.