తెలంగాణ

తెలంగాణలో నోవార్టిస్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్‌లో ఉన్న నోవార్టిస్ కంపెనీ ల్యాబోరేటరీ విస్తరణ, సిబ్బంది రెట్టింపు చేయడానికి అంగీకరించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం, నోవార్టిస్ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు బుధవారం అక్కడ నోవార్టిస్ కంపెనీ పబ్లిక్ పాలసీ హెడ్ పెట్రా లక్స్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నోవార్టిస్ కంపెనీ ఇప్పటికే ఆర్ అండ్ డి, డాటా సపోర్ట్ అండ్ అనాలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని విస్తరించడంతో పాటు సిబ్బందిని రెట్టింపు చేయనున్నట్టు పెట్రా లక్స్ ప్రకటించారు. అలాగే కొత్తగా 150 మంది పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్టు వివరించారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలోని జినోమ్ వ్యాలీ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ కంపెనీని ఏవిధంగా విస్తరించనుందో నోవార్టిస్ త్వరలోనే ప్రకటించనుందని చెప్పారు. అంతకుముందు ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంటోనీ ఫెర్నాండెస్, ఉప కార్యనిర్వహణాధికారి ఎయిరీన్ ఓమర్‌తో మంత్రి సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో దేశంలో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్‌లో విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేసారు. అనంతరం మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయితో మంత్రి కేటీఆర్ బృందం సమావేశమైంది. తమ కంపెనీ భారీ ప్రాజెక్టుల అవకాశాల కోసం చూస్తుందని, ముఖ్యంగా పారిశ్రామికవాడలు, వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులపై తమకు ఆసక్తి ఉందని వారు మంత్రికి వివరించారు. ఇలాంటి ప్రాజెక్టుల స్థాపనకు తమ రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటిని అధ్యయనం చేయడానికి తెలంగాణలో పర్యటించాల్సిందిగా మిత్సుబషి ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. మిత్సుబషి ముందుకు వచ్చి జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజేస్ పార్క్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి పార్క్‌లకు తన జపాన్ పర్యటనలో జైకా వంటి ఆర్థిక సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయని మంత్రి వివరించారు. కువైట్‌కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవో మహ్మద్ అల్గానిమ్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఇప్పటికే సోలార్ విద్యుదుత్పాదనలో అగ్రస్థానంలో ఉందని వివరించారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సహకాలను మంత్రి వివరించారు. విద్యుత్, మెడికల్ డివైజెస్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సీఈవో మహ్మద్ అల్ షయిభానీతో మంత్రి సమావేశమై తెలంగాణలో టెక్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. టి.హబ్ సంస్థకు ప్రపంచ గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసారు.