తెలంగాణ

మార్పు కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 24: రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించామని, ప్రజాసమస్యలపై ఎవరినైనా నిలదీస్తూ బాధ్యతతో కూడిన రాజకీయం చేస్తానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవత్వంతో కూడిన రాజకీయాలు తన అభిమతమని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతకైనా తెగిస్తానని, ఈక్రమంలో తనపై దాడులు చేసినా, విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. ఎవరి జీవితాలనూ ఇబ్బంది పెట్టకుండా కార్యకర్తలు ముందుకు సాగాలని చెప్పారు. అంబేద్కర్, కాన్షీరాం, ఫూలే, నారాయణగురు, పెరియార్ ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయ త్నం చేస్తానన్నారు. ఇందుకోసం తనకు ప్రేమానురాగాలను పంచే ఆడపడుచులతో పాటు ఉడుకు నెత్తురుతో ఉన్న యువత అండ కావాలని పిలుపిచ్చారు. సమాజంలో అన్ని కులా లు, మతాలకు సరైన న్యాయం జరగాలని స్పష్టం చేశారు. సామాజిక న్యాయమంటే సరిపోదని, దాన్ని అర్థం చేసుకొని సాధించటానికి ఉద్యమించాలన్నారు. వెనుకబడి వున్న కులాల వారు ముందుకొచ్చి తమ సమస్యలు పరిష్కరించుకునే దిశగా పనిచేయాలన్నారు. ప్రతిఒక్కరూ తమలోని లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగితే
సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యతో పాటు శ్రీకాకుళం కిడ్నీ బాధితుల సమస్య తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఒక కారణమని, అయితే వచ్చే ఎన్నికల్లో తాను చరిత్ర సృష్టిస్తానని అనుకోవడం లేదన్నారు. చివరి శ్వాస వరకు యువతకు అండగా ఉంటానని, ఏ పార్టీకీ పక్షపాతిగా ఉండబోనని స్పష్టం చేశారు. తాను ఎవరినీ విమర్శించనని, అయితే ఎవరైనా బాధ్యతగా మెలగాలన్నారు. తనకు సమస్యల పైనే ఆవేదన, ఆవేశం కలుగుతాయని, వ్యక్తులపై కాదని గుర్తుంచుకోవాలన్నారు. తన జీవితాన్ని జనసేన కోసమే ధారపోస్తానని, సమస్యల పరిష్కారమే ముఖ్యమని చెప్పారు. సామాజిక మార్పు కోసం వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తానని, దానికి యువత మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తనను ప్రేమించేవాళ్లకు సమయమిస్తానని, ద్వేషించేవాళ్లను దరిదాపుల్లోకి రానివ్వనన్నారు. సింగపూర్‌లో మాదిరిగా కుల నిర్మూలనకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేత వి హన్మంతరావు తనపై అనవసరమైన విమర్శలు చేస్తూ తనను కలిసి రావాలని కోరుతున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కలిసి వచ్చే విషయం పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజల భావజాలాలను ప్రభుత్వాలు అర్థం చేసుకొని పనిచేయాలన్నారు. అవినీతి అంతానికి పోరాడతానని, ఎవరి దగ్గరా చెయ్యి చాచనని ఆవేశంగా ప్రకటించారు. ‘జై తెలంగాణ’ నినాదం తనకెంతో ఇష్టమని, అయితే ‘్భరత్ మాతాకీ జై’ అని కూడా అనాలన్నారు. జై తెలంగాణ అంటే సామాజిక మార్పునకు సంకేతమని, నాడు రాష్ట్రం సాధించుకునేందుకు ఐక్యమైన రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఐక్యంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
అంతకుముందు ఆయన కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు 80కిలోమీటర్ల మేర ర్యాలీగా వచ్చారు. తల్లాడ వద్ద ఆయన వాహనంపై ఓ చెప్పు పడటం దుమారం రేపింది. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆయన ర్యాలీ కొనసాగింది. నిర్ణీత సమయం కంటే గంట ముందుగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి చేరుకొని అరగంటలోనే తన ప్రసంగం ముగించి వెనుతిరిగారు.