తెలంగాణ

మిషన్ భగీరథ అద్భుత పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 24: మిషన్ భగీరథ పథకం దేశంలోనే అద్భుతమైన పథకాల్లో మొదటి స్థానం దక్కించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఢిల్లీ సర్కార్ చీఫ్ సెక్రెటరీ సీకే మిశ్రా తెలంగాణ రాష్ట్ర సర్కార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని కోమటిబండలో బుధవారం మిషన్‌భగీరథ ప్రాజెక్టు ను ఆయన పరిశీలించారు. ఈ పథకాన్ని దేశంలోనే వివిద రాష్ట్రాలతో పాటు డిల్లీలో అమ లు చేయనుండగా, తెలంగాణాలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. అయితే గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాలు, తండాలకు సైతం తాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ సర్కార్‌కు దక్కుతుండగా, ఎక్కడో ఉన్న గోదావరి జలాలను దాహార్తి నివారణకు వినియోగించుకుంటుండడం అభినందనీయం కాగా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఇందులో భాగంగానే రాష్ట్రం అడిగిన అన్ని అనుమతులను ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీకే మిశ్రా పేర్కొన్నారు. కాగా మొదటగా రాష్ట్రం లో మిషన్‌భగీరథ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పనులను మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీకే మిశ్రాకు ఫొటో ఎగిబిషన్ ద్వారా వివరించారు. అలాగే మిషన్‌భగీరథ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రికగా భావిస్తూ గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరింపజేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ పథకానికి వివిధ సంస్థలు చేయూతనిస్తుండగా, కేంద్ర సర్కార్ సైతం ప్రోత్సహిస్తున్నట్టు గుర్తుచేశా రు. రాష్ట్ర ఇరిగేషన్ కార్యదర్శి ఎస్‌కే జోషి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, కలెక్టర్ హన్మంతరావు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా అటవీ అధికారి శ్రీదర్‌రావు, గజ్వేల్, సిద్దిపేట మిషన్‌భగీరథ ఈఈ లు శ్రీనివాస్, రాజయ్య, డిప్యూటీ ఈఈలు కమలాకర్, నాగార్జున, తహశీల్దార్ నిర్మల పాల్గొన్నారు.