తెలంగాణ

ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించిన వారిని అన్నివిధాలా ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 24: రిజర్వాయర్ ఆయకట్టు రైతు లు ఎంతసంతోషంగా ఉంటారో అంతకంటే ఎక్కువగా భూ నిర్వాసితులను సంతోషంగా ఉంచేందుకు కృషిచేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి భూ నిర్వాసితులకు పునరావస కేంద్ర నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు, జిల్లాకలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలసి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు పునరావస కాలనీ నిర్మాణానికి సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లి శివారులో 12 ఎకరాల స్థలంలో 151 మంది నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నిర్వాసిత కుటుంబానికి 10లక్షల విలువ చేసే 250 గజాల ప్లాట్ ఇవ్వటంతో పాటు అన్ని వసతులతో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల్లు నిర్మించి కాలనీలో అన్ని వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 2017 చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావసం ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదునుండి ఆరు నెలల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. దసరా పండుగను కొత్త ఇళ్లలో జరుపుకోవాలని సూచించారు. కొచ్చగుట్టపల్లి గ్రామంలో ఏవిధంగా సౌకర్యాలు ఉంటాయో అంతకంటే అధికంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. పాఠశాల, దేవాలయం, రేషన్‌షాపుతో అన్ని సౌకర్యాలు కల్పించి గ్రామాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. భూ నిర్వాసితులందరికీ రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తామన్నారు. ప్రత్యేకంగా ఫిషింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ప్రతి నిర్వాసిత వ్యక్తిని సభ్యుడిగా చేస్తామన్నారు. ప్రత్యేక ఫిషింగ్ చట్టాన్ని ఏర్పాటు చేసి దాని చేపలను విక్రయించి ప్రతి సభ్యుడికి పర్మినెంట్‌గా ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ప్లాటు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి 123 జీవో ప్రకారం భూసేకరణకు సహకరించిన నిర్వాసితులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. 2013 చట్టం ప్రకారం పునరావసం కల్పిస్తే ముంపు గ్రామం పక్కనే 75 గజాల స్థలం, ఐఎవై ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ప్లాట్లు పొందిన వారు ఇతర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేస్తే అక్కడ ఇళ్లు కట్టుకుంటామని కోరిన వారికి 5.04 లక్షలు ఇస్తామని, ప్లాట్ వారి పేరుమీదనే ఉంటుందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు గజ్వేల్ నియోజక వర్గ పరిధిలో ముట్రాజ్‌పల్లిలో ఆర్‌అండ్‌ఆర్ కింద పునరావసం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కొండపోచమ్మ నిర్వాసితులకు తున్కి బొల్లారంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భూ నిర్వాసితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ ఆనంద్, ఎంపీపీ మాణిక్యారెడ్డి, జడ్పీటీసీ కమల, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్‌శర్మ, సర్పంచ్‌లు రామస్వామి, సత్తెమ్మ, ఎంపీటీసీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.