తెలంగాణ

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, జనవరి 25: దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అడుగు జాడల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనను సాగిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
గురువారం ఎల్బీనగర్, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈరెడ్డి గార్డెన్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఆవిర్భావ సభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏచూరి మాట్లాడుతూ అగ్ర కులాల పాలనలో బడుగు బలహీన వర్గాల హక్కులు కాలగర్భంలో కలుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగులకు అధికారం రావాలంటే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు మాయమయ్యాయని, నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో ఉన్న బడా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్‌టి ఏర్పాటుతో పేద, మధ్య తరగతి జలపై మోయలేని పన్ను ల భారం పడుతుందని రోజు రోజుకు పెట్రోల్ ధరలు కొండెక్కుతున్నాయన్నారు. వాటి నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, అరాచక శక్తులు పెరిగాయని, వివిధ వర్గాల మద్య చిచ్చులు పెడుతున్నారన్నారు. టీమాస్ చైర్మన్ కంచె ఐలయ్య మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలలో కాకుండా ప్రైవేట్ సంస్థలలో కూడా 25 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు బలహీనవర్గాలను విద్యా రంగంలో ప్రోత్సహించాలన్నారు. దేశం లో ఆవు పాలన కొనసాగుతుందన్నారు. ఎవరైనా బెండ కాయ, బీరకాయలు తింటే చైనాతో యుద్దం చేయగలరా.. అని ప్రశ్నించారు. 93 శాతం ఉన్న బీసీ కులాలకు రాజ్యాధికారం కావాలని జనాభాలో 7 శాతం ఉన్న రెడ్డిలు, 1 శాతం వెలమల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఎల్‌ఎఫ్ పార్టీ 93శాతం బడుగులకు సీట్లు కెటాయిస్తే టీమాస్ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందని ఐలయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్, టీడీపీ విధానాలు, ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పాలసీలకు భిన్నంగా మార్క్సిస్టులు, పూలే, అంబేద్కరిస్టులు కలిపి ఒక ప్రత్యామ్నాయ ప్రజావేదిక రూపంలో జనం ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. బీల్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రకాశ్ అంబేద్కర్, కాకి మాధవరావు, మల్లు స్వరాజ్యం, సాంబశివుడు, జేబీ. రాజు, నల్లా సూర్యప్రకాష్, జి రమేష్, సన్నం రాజయ్య పాల్గొన్నారు.
బీఎల్‌ఎఫ్
రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు
బీఎల్‌ఎఫ్ రాష్ట కమిటీలో రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈకమిటీకి చైర్మన్‌గా నల్లా సూర్యప్రకాశ్, వైస్ చైర్మెన్‌లుగా ప్రొ. విశే్వశ్వర్‌రావు, జలగం సత్యనారాయణ, వనజ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కన్వీనర్లు గా తమ్మినేని వీరబద్రం, మజీదుల్లాఖాన్, మద్దికాయల అశోక్, జానకి రాములు, గొర్రె రమేష్, మున్నారం నాగరాజు, చంద్రవౌళి, కోశాధికారిగా ఇబ్రహీంలు ఎన్నికైనట్లు సమావేశంలో ప్రకటించారు.
బీఎల్‌ఎఫ్‌లో సీపీఐని
భాగస్వామ్యం చేయాలి: ఏచూరి
బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌లో సిపిఐను భాగస్వామ్యం చేయాలని సిపిఐ అగ్రనేత సీతారాం ఏచూరి , సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని కోరారు. ఆయన ఇక్కడ సురవరం ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉభయులు చర్చించారు.

చిత్రం..సభలో ప్రకాశ్ అంబేద్కర్‌తో ముచ్చటిస్తున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి