తెలంగాణ

రైతాంగ సమస్యలపై ఉద్యమబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 25: రాష్ట్రంలో రైతాంగం ఏదుర్కొంటున్న సమస్యలపై టీజేఎసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం వెల్లడించారు. జిల్లాకేంద్రంలో టీజేఎసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతాంగ సమస్యలు - ఉద్యమ కార్యాచరణ సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జేఏసీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా గ్రామాల్లో గత నెలరోజుల నుండి రైతు సమస్యలపై అధ్యయనయాత్ర నిర్వహించి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకున్నామన్నారు. వీటి పరిష్కారం కోసం పోరుబాటకు సమాయత్తం అవుతున్నామని, వచ్చేనెల 4న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్టస్థ్రాయి సన్నాహక సదస్సులో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగాన్ని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ చేయూత లేక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్టర్రైతాంగంలో భరోసా కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ దశల వారీగా చెల్లిండంతో వడ్డీలకే సరిపోయిందన్నారు. రాష్ట్రంలో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అందక కౌలు రైతులు దిక్కుత చని స్ధితి లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటుధర దక్కడం లేదని, దళారులు రైతులను మోసగిస్తూ వారు లబ్ధి పొందుతున్నారన్నారు. రైతులకు కచ్చితమైన గిట్టుబాటుధర దక్కాలంటే ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

చిత్రం..సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ కోదండరాం