తెలంగాణ

విద్యాహక్కు చట్టం అమలు ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 25: కేంద్రప్రభుత్వం రూపొందించిన రైట్ టు ఎడ్యుకేషన్ నిబంధనలను అమలుచేసే ఆలోచన రాష్ట్రప్రభుత్వానికి లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నిబంధనల అమలువల్ల ఇంజనీరింగ్ కళాశాలల మాదిరిగా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి మరో ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కాంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. గురువారం ఇక్కడ హరితా హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే భోధన, బోధనేతర సిబ్బందితో వౌళిక సదుపాయాలు కల్పించటం ద్వారా విద్యార్థులకు ఉచిత బోధన కల్పించేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలో భాగంగానే తమ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా పేదవిద్యార్థులకు ఉచిత విద్యావకాశాలను కల్పిస్తోందని, ప్రస్తుతం ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ విద్యాసంస్థలలో ఉచిత విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ విద్యాసంస్థలలో అవసరమైన సిబ్బంది, వౌళిక సదుపాయలు ఏర్పాటుచేసిన అనంతరం ప్రైమరీ, ప్రి-ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకవస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చాయని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రించాలని చెబుతున్న న్యాయస్థానాలే మరోపక్క ఫీజుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలకు పిటీషన్లపై స్టేలు ఇస్తున్నాయంటూ, ఈ విషయంలో ప్రభుత్వం అడ్వకేటు జనరల్‌తో, ఇతర న్యాయనిపుణులతో చర్చిస్తోందని చెప్పారు.
జిల్లాల కుదింపు ఆలోచన లేదు
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న జిల్లాలను కుదించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కడియం స్పష్టం చేసారు. పరిపాలన ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పది జిల్లాల స్థానంలో 31 జిల్లాలను ఏర్పాటుచేసారని, దీని ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. జిల్లాల కుదింపు చేస్తే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తు, పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలను, గ్రామాల పరిధిని ముందుముందు మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. కాగా వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో రూరల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మద్య ఏకాభిప్రాయం లేదని ఆయన చెప్పారు. త్వరలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై రూరల్ జిల్లాకేంద్రంపై ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు.