తెలంగాణ

‘వీరుల పోరుగద్దె మేడారం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 25: ఆదివాసి వీర వనితలు సమ్మక్క, సారలమ్మలపై ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సంపాదకీయంలో రచించిన పరిశోధనాత్మక గ్రంథం ‘వీరుల పోరుగద్దె మేడారం’ పుస్తకావిష్కరణ సభ గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఇప్పటి వరకు లిఖిత పూర్వకంగా అందుబాటులో లేని సాహిత్యాన్ని 14 ఏళ్లు శ్రమించి ప్రచురించిన పుస్తకాన్ని సంపాదకుడు జయధీర్ తిరుమల రావు, సహ సంపాదకులు గూడూరు మనోజ, పద్దం అనసూయ, పొట్లపల్లి వరప్రసాద్, డా.కే.ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. తిరుమల రావు మాట్లాడుతూ ఆదివాసీ చరిత్రపై లోతైన అధ్యాయణం జరగాల్సి ఉందని అన్నారు. కాకతీయ రాజుల అధిపత్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి పోరాడిన సమ్మక్క, సారలమ్మలు ఆదివాసీల దేవతలుగా పూజింపబడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వౌఖిక సాహిత్యంగానే ఉన్న కోయ, గోండు, డోలి కుల వీరగాథలను లిఖితపూర్వకంగా వెలుగులోనికి తెచ్చేందుకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి అక్కడి డోలిల నుంచి సేకరించిన అనేక అంశాలతో ఈ గ్రంథాన్ని ప్రచురించినట్టు తెలిపారు.

చిత్రం.. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జయధీర్ తిరుమల రావు