తెలంగాణ

నేటి నుంచి రాజ్యాంగంపై సాంఘిక సంభాషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: భారత రాజ్యాంగం, సాహిత్యం అంశాలపై సైనే్సషన్ సొసైటీ సాంఘిక సంభాషణ కార్యక్రమాన్ని 26,27 తేదీల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసింది. 26న రాజ్యాంగంపై జరిగే సాంఘిక సంభాషణలో డాక్టర్ జయశ్రీ సుబ్రమణియన్, డాక్టర్ లావణ్య సురేష్, ఎల్ రవిచందర్, కల్పన రమేష్ జ్యూరీ సభ్యులుగా పాల్గొంటారు. 27న జరిగే సాహిత్య సంభాషణకు ప్రొఫెసర్ శశి తరు, ప్రొఫెసర్ ఉషా రామన్, విజయ్ మరుర్, అపర్ణ తోట జ్యూరీ సభ్యులుగా పాల్గొంటారు. టిస్, ట్రిపుల్ ఐటి తదితర సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారని సైనే్సషన్ వ్యవస్థాపకుడు తరుణ్ అయితం చెప్పారు. కాగా ఉన్నత విద్యారంగంపై 28వ తేదీన ట్రిపుల్ ఐటిలో సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ రమేష్ లోగనాధన్, ఆర్ శ్రీనివాసరావు, విజయ్ వేదాంతం, శ్రీరాం కరి, డాక్టర్ దినేష్ చంద్రశేఖర్, ఆహార్ ఫర్హన్, సిద్ధార్థ మేక, యుక్తేష్ చింతమడక తదితరులు పాల్గొంటారని అన్నారు.