తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్తోను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో కేంద్ర మంత్రితో జూపల్లి గురువారం భేటీ అయ్యారు. జిల్లాపరిషత్‌లు, మండల పరిషత్‌లకు కూడా గ్రామపంచాయితీలకు ఇస్తున్న విధంగానే ఆర్థిక సాయం చేయాలని సూచించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 535 నివాస ప్రాంతాల్లో 1230 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణానికి 800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. ధీన్‌దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన కింద ఈ ఏడాది తెలంగాణలో 37,311 మందికి శిక్షణ ఇచ్చామని, మరో 10 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణలో 86,673 మందికి శిక్షణ ఇవ్వాలంటూ లక్ష్యంగా నిర్ణయించాలని కోరారు. 2018 లో 10.28 కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకం కింద కల్పించామని, మరో 1.50 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించేందుకు నిధులు ఉన్నాయని, దీనికి అదనంగా మరో రెండుకోట్ల పనిదినాలు కల్పించేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. మరుగుదొడ్లు, తదితర నిర్మాణాలకు సంబంధించి 2016-17, 2017-18 సంవత్సరాలకు బకాయి ఉన్న 725 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా గ్రామపంచాయితీల్లో పనిచేసే పారిశుద్ద్య కార్మికులకు జాతీయ ఉపాధిహామీ ద్వారా వేతనాలు చెల్లించేందుకు అనుమతివ్వాలని జూపల్లి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తోమర్తోను కోరారు.