తెలంగాణ

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ఉపాధికి పరిమితం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని దళిత యువతకు విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హితవు పలికారు. పూర్వకాలంలో వృత్తి విద్యా కోర్సులు వారసత్వంగా సంక్రమించేవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థలో దళిత యువతకు ఉపాధి రంగంలో శిక్షణ కోర్సులను మంత్రి జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థ డైరెక్టర్ శేరి చిన్నం రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను నియమించకుండా గత ప్రభుత్వాలు తాత్సారం చేయడం వల్ల లక్షలాది మంది పట్ట్భద్రులు పట్టాలు చేతిలో పట్టుకుని నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.