తెలంగాణ

ఐఐటీలో అమ్మాయిలకు అదనపు సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: దేశవ్యాప్తంగా ఐఐటిల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో వారి కోసం అదనంగా సూపర్‌న్యూమరీ సీట్లను పెంచాలని ఐఐటి కౌన్సిల్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన అడ్మిషన్ల గణాంకాలు చూస్తే మొత్తం సీట్లలో అమ్మాయిలు 8 శాతం మాత్రమే ఉన్నారు. కొన్ని రిజర్వుడ్ కేటగిరిల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. మిగిలిన చోట క్వాలిఫై అయిన అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. మొత్తంగా చూస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోందని ఈ విశే్లషణలు తేల్చాయి. 2017లో ఐఐటిల్లో అమ్మాయిలకు ప్రత్యేకించి 400 సీట్లను పెంచారు. దాంతో ప్రస్తుతం 23 ఐఐటిల్లో 10998 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం సీట్లు 11,509కు పెరుగుతాయి. ఆ సీట్లను అలాగే కొనసాగిస్తూ మరో 521 సీట్లు పెరుగుతాయి. మొత్తంగా చూస్తే 1600 వరకూ సూపర్‌న్యూమరీ సీట్లను పెంచినట్టవుతుంది. ఐఐటిలతో పాటు జాతీయ స్థాయి వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో కూడా సీట్లను పెంచనున్నారు.