తెలంగాణ

కేంద్రం ఆదేశించినా ఉలుకూ పలుకూ లేని రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి27: కేంద్రం ఆదేశించినా రాష్ట్రాల్లో చిత్తశుద్ధి కొరవడి ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో సహా దివ్యాంగుల చదువులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దివ్యాంగుల విద్యావ్యాసాంగానికి సంబంధించి నియమ నిబంధనలు, చట్టాల రూపంలో రాజ్యాంగ బద్ధతను కేంద్రం కల్పించినా, వాటిలో కొన్నింటిని మాత్రమే విద్యాశాఖ ఏరికోరి అమలుచేయడంతో పూర్తిస్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫోరం జాతీ య కన్వీనర్ కల్పగిరి శ్రీను పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం 2017లో సెక్షన్ 16వౌ లిక సదుపాయాల కల్పన, సెక్షన్ -17లో దివ్యాంగుల చదువులను ప్రోత్సహించే నిబంధనలు పేర్కొ న్నా వాటిని పాఠశాల విద్యాశాఖ పక్కన పెట్టిందని అన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసినా, వాటిని రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని అన్నారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి జోలి దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టంపై రాష్ట్రాలకు లేఖలు రాశారని, విద్యా హక్కు చట్టంలో దివ్యాంగులకు సంబంధించిన నియమనిబంధనలు పేర్కొన్నా, మరోమారు దానిని విస్తరించి దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టా న్ని రూపొందించడం జరిగిందని, విద్యాహక్కు చట్టం సెక్షన్ 2డిలో సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రస్తావించినా, తర్వాత సెక్షన్ ఇలో వైకల్యపరమైన వెనుకబాటుతనాన్ని వివరించడం జరిగిందని, బహుళ వైకల్యంతో ఉన్న వారి గురించి సెక్షన్ 2(జె)లో ప్రస్తావించడమైందని, తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థుల గురించి సెక్షన్ -2(ఒ)లో ప్రస్తావించారని, అలాగే చాప్టర్ -3లో దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం నియమనిబంధనలను కూడా ప్రస్తావించిందని, అయితే అందులో సెక్షన్ 17లోని కేవలం సబ్‌క్లాజ్ - ఎ మాత్రమే పేర్కొన్నారని, మిగిలిన క్లాజులను కూడా అందులో చేర్చాలని కల్పగిరి కోరారు. వౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రతి పాఠశాలలో ర్యాంప్‌లు ఉండాలని, దివ్యాంగులకు దిగువనే తరగతులు నిర్వహించాలని, లిఫ్టు వంటి సదుపాయాలను యూనివర్శిటీల్లో ఏర్పాటు చేయాలని, స్వేచ్ఛగా చదువుగరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఉం దని కల్పగిరి ఆరోపించారు. దివ్యాంగుల హక్కులకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను, చట్టంలోని నిబంధనలను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.