తెలంగాణ

జాతరలో విధుల నిర్వహణ అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 27: మేడారం జాతరలో విధులు నిర్వహించటం ఒక అదృష్టంగా భావించి ప్రతి అధికారి, ఉద్యోగి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. మరో నాలుగురోజుల్లో మేడారం సమ్మక్క-సారల మ్మ ప్రాంగణం కోటిమందితో మహానగరంగా మారబోతోందని చెబుతు అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు దర్శనం సులభంగా లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. శనివారం స్పీక ర్ మధుసూదనాచారి మేడారానికి వచ్చి సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు బెల్లంతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోని ఒక చిన్న ప్రాం తానికి కోటిమంది భక్తులు రావటం, అమ్మవార్లను దర్శించుకుని వెళ్లటం ఒక మహత్యంగా అభివర్ణిస్తూ, అమ్మవార్ల దీవెనలతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. మానవజాతి చరిత్ర పరిణామాల్లో ఎక్కడ కూడా 10కిలోమీటర్ల పేర ఇంతమంది భక్తులు వచ్చే పరిస్థితి లేదని కుంభమేళాలు కూడా వందల కిలోమీటర్ల పరిధిలో, నదీ పరీవాహక ప్రాంతాల్లోనే జరుగుతాయని తెలిపారు. మేడారం జాతరలో సేవలు అందించే ప్రతి అధికారి మళ్లీ జరిగే జాతరలో మరోసారి సేవలు అందించాలని ఉబలాటపడతారని, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు మళ్లీ జాతరలో సేవలు అందించేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. మేడారం జాతరలో సేవలు అందించే అధికారి రాష్ట్రంలో ఎక్కడైనా సమర్ధవంతంగా పనిచేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత జాతరకు హాజరయ్యానని, భూపాలపల్లి జిల్లా ఏర్పాటు జరిగిన తరువాత మొదటిసారి సొంత జిల్లాలో జరిగే జాతరకు హాజరవుతున్నానని అన్నారు. గతంలో చిన్నప్పుడు తాను ఎడ్లబండ్లపైన, కాలినడకన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటితో పోలిస్తే ఇప్పుడు రవాణా సౌకర్యాలు, స్థానికంగా భక్తులకు పలు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎడ్లబండిపై మరోసారి తాను జాతరకు వచ్చి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పారు. సమీక్ష అనంతరం మేడారంలో ఏర్పాటుచేసిన గిరిజన మ్యూజియంను స్పీకర్ సందర్శించారు. ఆ తరువాత జంపన్నవాగు వద్దకు వెళ్లి భక్తుల స్నానా లు చేసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
చిత్రం..తులాభారం ద్వారా అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్న స్పీకర్