తెలంగాణ

పేద, మధ్య తరగతి ఇళ్ళపై వంద శాతం పెనాల్టీ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, దేవాలయ, వక్ఫ్ భూముల్లో కట్టుకున్న ఇళ్ళపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ విభాగం వంద శాతం పెనాల్టీ విధించడం భావ్యం కాదని ‘పట్నం’ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు కె. వేణుగోపాల రావు, ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు తెలిపారు.
పేద, మధ్య తరగతి ఇళ్ళపై విధించిన వంద శాతం పెనాల్టీని విరమించుకోవాలని వారు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్‌లో మిగులు భూముల్లో కట్టుకున్న ఇళ్ళ నిర్మాణాలను పేదలకు ఉచితంగా, మధ్య తరగతి ప్రజలకు భూమి వలువలో కొంత భాగాన్ని వసూలు చేసి రెగ్యులరైజ్ చేస్తామని జివో 58, 59 జారీ చేసిందని వారు గుర్తు చేశారు. కాగా వీటికి భిన్నంగా గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి పన్నుతో పాటు వంద శాతం పెనాల్టీ విధిస్తూ సర్క్యులర్ జారీ చేసిందని వారు తెలిపారు. కాబట్టి దానిని వెంటనే విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.