తెలంగాణ

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ (డిజిపి) ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. స్నేహపూర్వక పోలీసు విధానాలను అనుసరిస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. తాము అందిస్తున్న సేవలు, జవాబుదారీతనం పట్ల ప్రజలు ఏరకంగా స్పందిస్తున్నారనే అంశంపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కూడా చాలా అవసరమని అన్నారు. సోమవారం నాడిక్కడ ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ శిక్షణ కేంద్రం ఆవరణలో రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళానికి ఎంపికైన 9 నెలల శిక్షణ అనంతరం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో డిజిపి పాల్గొన్నారు. ఈ బ్యాచ్ ద్వారా బయటకు వెళుతున్న 935 మంది కానిస్టేబుళ్లు పరేడ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిపి పరేడ్‌ను పరిశీలించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ శిక్షణ ద్వారా సామాన్య పౌరులుగా ఉన్న మీరంతా ప్రజలకు అందించే సేవలు, వాటి విధివిధానాలు, నైపుణ్యాన్ని ఈ 9 నెలల్లో అందించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో శాఖ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి తాము నిర్వహించే విధులను పరిశీలించుకోవాలని, తద్వారా శాఖపరమైన ఉద్ధేశ్యాలు వెల్లడవుతాయని చెప్పారు. ప్రజలను రక్షించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విలువలు, నైతికతను ఎప్పుడూ విస్మరించ వద్దని కోరారు. అంతర్గత భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టే అధికారులు చట్టాన్ని గౌరవించి నడుచుకోవాలని, శాఖలో మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని డిజిపి సూచించారు.
పరేడ్ అనంతరం పరేడ్, ఫైరింగ్, ఇన్‌డోర్, ఔట్‌డోర్ కార్యక్రమాల్లో ప్రతిభను కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్‌భగవత్, బెటాలియన్ ఐజి అభిలాష్ బిష్ట్, ఆపరేషన్స్ ఐజి కె.శ్రీనివాస్‌రెడ్డి, సిఐడి ఐజి షికా గోయల్, ఎఐజి ఎం.రమేష్‌రెడ్డి, సిటిసి ప్రిన్సిపాల్ శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ అనంతరం సైలెంట్ డ్రిల్, మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రదర్శనలు నిర్వహించారు.

చిత్రం..టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో గౌరవ వందనం స్వీకరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి