తెలంగాణ

గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర మత్స, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జంట నగరాల్లోని గ్రంథాలయాల అధికారులతో మంత్రి తలసాని సోమవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్ కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి కోటి రూపాయలను మొదటి దశలో ఎంపిక చేసిన 20 గ్రంథాలయాలలో కనీస అవసరాలు కల్పించేందుకు ఖర్చు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. జంట నగరాల్లో మొత్తం 86 గ్రంథాలయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రంథాలయాల సమస్యలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఖరీదైన పుస్తకాలను కొనుగోలు చేయలేని వారు గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకుంటారని ఆయన తెలిపారు. కార్పోరేట్లు కూడా తమ పరిథిలోని గ్రంథాలయాలను దత్తత తీసుకుని ధాతల సహకారంతో అభివృద్ధి చేయాలని మంత్రి తలసాని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర ఆయాచితం శ్రీ్ధర్, కలెక్టర్ యోగితారాణా పాల్గొన్నారు.