తెలంగాణ

బాబు అండ ఉంది..భయం వలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ‘ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు అండగా ఉన్నారు..’ అని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో రమణ అధ్వర్యంలో ‘పల్లెపల్లెకు తెలుగు దేశం’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూచన మేరకు పల్లెపల్లెకు టిడిపి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని ఆయన తెలిపారు.
మంచిర్యాల జిల్లా, నెనె్నల మండల పార్టీ అధ్యక్షుడ రంగు రామగౌడ్ రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను నిలదీసినందుకు అక్రమ కేసులు పెట్టి, ఇబ్బందులకు గురి చేశారని, దీంతో రామగౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రామగౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ తరఫున బిఎన్ రెడ్డిని పంపించామని ఆయన తెలిపారు. ఏ సమస్య ఉన్నా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుని రావాలని, ఎవరూ అధైర్యపడవద్దని, చంద్రబాబు అండగా ఉన్నారని ఆయన చెప్పారు. హత్యలపై హోం మంత్రిని కలిసి వివరించనున్నట్లు రమణ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ నాయకులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.