తెలంగాణ

ఎమ్మార్పీని మించి విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 29: మేడారం జాతర కోసం మద్యం వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా భారీమొత్తంలో మద్యం స్టాకు డంప్ చేసారు. జాతర ప్రాంతంలో పెద్దమొత్తంలో బెల్టుషాపులు ఏర్పాటుచేసి వాటి ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జాతర మొదలవకముందే మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. జాతర కోసం ఎక్సైజ్ శాఖ గిరిజనులకు ప్రత్యేకంగా 12 మద్యం షాపులు కేటాయించగా, వాటిని కాదని కొందరు మద్యం వ్యాపారులు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్నారు. ప్రతి మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే భక్తుల కోసం జాతర ప్రాంతంలో ప్రత్యేకంగా మద్యం షాపులు ఏర్పాటుచేస్తారు. ఈ షాపులకు అవసరమైన మందు సరఫరా చేసేందుకు ఎక్సైజ్ అధికారులు నార్లాపూర్‌లో ప్రత్యేకించి ఒక గోడౌను ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా అదే విధంగా మద్యం షాపుల ఏర్పాటు, మద్యం గోదాము ఏర్పాటు తతంగాన్ని అధికారులు పూర్తిచేసారు. ఈ షాపులకు సరఫరా చేసే మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ ఇతర సాధారణ ప్రాంతాల్లోని మద్యం షాపులతో పోలిస్తే కాస్త ఎక్కువగా వసూలు చేస్తారు. జాతర సమయాల్లో ఎమ్మార్పీ నిబంధనలను పక్కన పెట్టి ఈ మద్యం షాపులలో ఎక్కువ ధరలకు అమ్మటం షరామామూలు కార్యక్రమంగా కొనసాగుతుంది. కానీ జాతరలో ప్రభుత్వ ఆమోదిత మద్యం షాపుల ఏర్పాటుకు ముందే వివిధ ప్రాంతాలకు చెందిన మద్యం వ్యాపారులు స్థానికంగా కొందరి మద్దతుతో భారీమొత్తంలో మద్యం స్టాకు తీసుకువచ్చి డంప్ చేసారు.
సమీపంలోని ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా నాన్ డ్యూటీ మద్యం పెద్దమొత్తంలో ఇక్కడకు తరలించి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కిరాణ షాపులు, టీ కొట్లు, పాన్‌షాపులు, మటన్, చికెన్ సెంటర్ల అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి మద్యం స్టాకు అక్రమంగా తెప్పించి నిలువ చేసిన కారణంగా ఎక్సైజ్ శాఖకు డ్యూటీ రూపేణా రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. మద్యం వ్యాపారులు మాత్రం నిబంధనలకు విర్ధుంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నారు.