తెలంగాణ

అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి టోకరా వేసిన నలుగురు అంతర్ రాష్ట్ర నేరగాళ్లలో ఇద్దరిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి నగర సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన కాకల్ హుస్సేన్ అలియాస్ బషీర్, జునేజా లతీఫ్ మహ్మద్ అలియాస్ తోఫిక్‌లను అరెస్టు చేయగా, అదే రాష్ట్రానికి చెందిన గణేశ్, కుమార్‌లు తప్పించుకున్నారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ బంగారు నగల దుకాణల వారితో పరిచయాలు పెంచుకుంటారు. ఆ తర్వాత ఫలానా చోటకు వస్తే బంగారం తీసుకెళ్లవచ్చని పోన్‌లో చెబుతారు. తీరా అక్కడికి వెళ్లి డబ్బు తీసుకున్నాక, కస్టమ్స్ అధికారుల దాడుల సమస్య ఉందని చెప్పి రహస్యంగా మరోచోట అందజేస్తామని చాలా నమ్మకంగా బుట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత ఎంత ఎదురు చూసినా డబ్బు పోవడం తప్ప బంగారం ఇవ్వరు. ఇలా మోసపోయిన సికింద్రాబాద్ పోట్ మార్కెట్‌కు చెందిన బంగారం వ్యాపారి ఎం.సంపత్‌కుమార్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు సంపత్‌కుమార్‌ను గుజరాత్‌లోని భుజ్ నగరానికి రావాలని చెప్పారు. రూ.13 లక్షలు చెల్లిస్తే అరకిలో బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేశారు. డబ్బు తీసుకున్నాక ఇక్కడ కస్టమ్స్ దాడుల ఇబ్బంది ఉందని, మరో చోటకు వస్తే రహస్యంగా తమ మనిషి బస్సులో ప్రయాణించి మీ వద్దకు వచ్చి ఇస్తాడని నమ్మకంగా చెప్పారు. అది విన్న సంపత్‌కుమార్ చెప్పిన చోట ఎంతసేపు చూసినా రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. ఈ ఫిర్యాదు మేరకు సిసిఎస్ స్పెషల్ టీమ్ విచారణ చేపట్టింది. అనంతరం గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. ఈ కేసును సిసిఎస్ స్పెషల్ టీమ్, మార్కెట్ పోలీసులు దర్యాప్తు చేశారు.