తెలంగాణ

గిరిజన కమిషన్ ఆఫ్ ఎంక్వయరీ గడువు ఏడాది పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పాటైన కమిషన్ ఆఫ్ ఇంక్వ్యరీ గడువును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా పేరుతో ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 4) జారీ అయ్యాయి. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్. చెల్లప్ప చైర్మన్‌గా, ఐపిఎస్ (రిటైర్డ్) అధికారి కె. జగన్నాథరావు, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ (రిటైర్డ్) హెచ్.కె నాగు సభ్యులుగా ఈ కమిటీని ప్రభుత్వ 2015 మార్చి 3 న మొట్టమొదట ఏర్పాటు చేసింది. ఆరు నెలల వ్యవధిలో నివేదిక సమర్పించాలంటూ కమిటీ ఏర్పాటు సమయంలో కాలవ్యవధి నిర్ణయించారు. అయితే ఆరునెలల్లో నివేదిక తయారు కాలేదు. గిరిజనుల సమస్యలు అధికంగా ఉండటంతో కమిటీ చైర్మన్ కోరిక మేరకు ఈ కమిటీ గడువును పొడిగిస్తూ వచ్చారు. చివరి గడువు 2018 జనవరి 31 తో ముగిసింది. నివేదిక సిద్ధం కాకపోవడంతో ఈ కమిటీ గడువును పొడిగించాలంటూ మరోసారి ఈ కమిటీ కోరడంతో 2019 జనవరి 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.