తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి టిఆర్‌ఎస్‌యే అధికారంలోకి రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్ ఒక్కటే 100 సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేల్లో వెల్లడైందన్నారు. అన్ని పార్టీలు ఏకమైనా ‘వార్ వన్ సైడ్’గా ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో నిజామాబాద్ జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టే కార్యక్రమాలకు నిధుల కేటాయింపు అంశంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించడానికి సచివాలయానికి వచ్చి న కవిత ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. టిజెఎసి నాయకుడు కోదండరామ్ రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ నుంచి పోటీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా నిర్ణయించేది ప్రజలేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపిగానే పోటీ చేస్తానా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? అనేది పార్టీ నిర్ణయయిస్తుందన్నారు. తనకు తెలిసినంత వరకు మంత్రివర్గ పునర్ వ్యస్థీకరణ ఉండకపోవచ్చనీ, ఒకవేళ ఉంటే మాత్రం మహిళలకు అవకాశం కల్పించాలని కోరుతానన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని ఈ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. కేంద్రంతో తమకు కావాల్సింది తగువు కాదని, పనులు ముఖ్యమని కవిత స్పష్టం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణకు ఒక్కటైనా పద్మశ్రీ అవార్డు దక్కపోవడం బాధకరమన్నారు.
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో బలంగా తమ గళాన్ని వినిపించబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాజకీయ వారసులు ఎవరనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల బిజెపేతర రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ముసాయిదా తయారవుతుందని, ఇది పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి యాత్ర చేస్తారన్నారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని ఆలోచిస్తుందన్నారు.

చిత్రం..సచివాలయంలో వైద్య మంత్రి లక్ష్మారెడ్డితో ఎంపీ కవిత భేటీ