తెలంగాణ

పరిశోధనా ఫలితాలు రైతులకు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య సమన్వయం సాధించి రైతాంగానికి మెరుగైన సేవలు అందిస్తామని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక వనరుల సమీకరణ వినియోగంపై రెండో వర్క్‌షాప్ మంగళవారం ఇక్కడ జరిగింది. తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పంటల యాజమాన్య పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు, చేర్పులతో మంచిదిగుబడులు సాధించవచ్చని కమిషనర్ తెలిపారు. జిల్లాల వారీగా పంటల ప్రణాళికలను రూపొందించి నివేదిక ఇవ్వాలని శాస్తవ్రేత్తలను కోరారు.
తెలంగాణ సాంకేతిక వనరుల సమీకరణలో ఇక్రిసాట్ సహకారం అందిస్తుందని ఇక్రిసాట్ శాస్తవ్రేత్త అనుప పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వాతావరణ శాఖ శాస్తవ్రేత్త వైకె రెడ్డి తెలిపారు. వరి, అపరాలు, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటల్లో దిగుబడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు వివరించారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను స్థానిక పరిస్థితులకు అనుకూలగా తయారు చేసి నివేదిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలకు చెందిన శాస్తవ్రేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.