తెలంగాణ

సీఎం చెప్పమన్నట్లుగానే ఎస్పీ చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 30: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో పోలీసులు వాస్తవాలను మరుగుపరిచి సీఎం కేసీఆర్ చెప్పమన్నట్లుగా కట్టుకథ వినిపించారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యు డు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హత్య కేసు నిందితులంతా ఎస్పీ సమావేశానికి ముస్తాబై వచ్చిన తీరు, మిర్చిబండి పంచాయితీ హత్యకు దారితీసిందంటూ ఎస్పీ చెప్పడం, హత్య జరిగిన రోజు నాటి నిందితుల కాల్‌డేటా ఇస్తామని చెప్పి పోలీసులు ఇవ్వకుండా మోసం చేయడం చూస్తే పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినట్లుగా తేలిందన్నారు. అందుకే తాము శ్రీనివాస్ హత్య కేసును సిబిఐతో విచారించాలని ఆదేశించాలంటు హైకోర్టులో కేసు వేశామన్నారు. ఇరువై ఏళ్లుగా నేరాలకు, దాడుల సంస్కృతి రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్న నల్లగొండలో టిఆర్‌ఎస్ నాయకులు మళ్లీ హత్యా రాజకీయాలతో అరాచకం సృష్టించారన్నారు. శ్రీనివాస్ హత్య జరిగిన ఐదు రోజులకే మరో వ్యక్తి హత్య జరిగిన తీరు నల్లగొండలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమన్నారు. నల్లగొండలో టిఆర్‌ఎస్ నాయకుల అరాచకాలపై తాను సీఎం కెసిఆర్‌కు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదని, శ్రీనివాస్ హత్యపై నేటికీ స్పందించలేదన్నారు. నాగారంలో మధన్‌మోహన్ అనే నాయకుడి హత్య కేసులో మొదటి ముద్ధాయిగా ఉన్న జగదీష్‌రెడ్డిని మంత్రివర్గంలో పెట్టుకుని, నేర చరిత్ర ఉన్న వారికి ఎమ్మె ల్యే టికెట్‌లిచ్చిన కెసిఆర్ ఇకనైనా వారి అరాచాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో పనె్నండు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ సర్వేలో తేలినందునే ఇటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. వేముల వీరేశంకు తనను విమర్శించే స్థాయి లేదని అతనిలాగా తనకు నేర చరిత్ర లేదన్నారు. సీఎంకెసిఆర్ శ్రీనివాస్ హత్యపై నిష్పక్షపాత విచారణ జరిపించేందుకు కేసును సిబిఐకి అప్పగించి తన గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. శ్రీనివాస్ సంతాపసభను ఫిబ్రవరి 4వ తేదిన నల్లగొండలో భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ సంతాప సభకు ఏఐసీసీ నాయకులు కుంతియాతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సహా టి.కాంగ్రెస్ పెద్దలంతా హాజరవుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నేరచరిత్ర ఉన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, నియోజకవర్గ పర్యటనల్లో తనపై సైతం పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. ఆయన బెదిరింపులపై తాను ఎస్పీలను సైతం కలిసి భద్రత కోరానన్నారు.
వీరేశం హత్య కు సుపారీ ఇవ్వాల్సిన అవసరం వెంకట్‌రెడ్డికి లేదన్నారు. వీరేశం తాను మాజీ నక్సలైట్ ప్రభాకర్‌నంటూ, దళితుడినంటూ అధికారులను బెదిరించడం, పారిశ్రామిక వేత్తను, విద్యాసంస్థల నిర్వాహకులను బెదిరించడం, భూదందాలు, ఇసుకదందాలకు పాల్పడం వంటి అనేక నేరాలకు పాల్పడ్డాడన్నారు.

చిత్రం..నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి