తెలంగాణ

ప్రాణహిత తీరంలో 58 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 30: కొండ కోనల నడమ మారుమూల గిరిజన గూడెం సోమినిలో సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకొని 58 ఆదివాసీ గిరిజన జంటలకు మంగళవారం సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు వేడుకగా జరిగాయి. కరవుతో అల్లాడుతున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దులోని బెజ్జూర్ మండలం సోమిని మారుమూల గిరిజన పల్లెలో ఆదివాసీల వివాహ వేడుకలను సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సొంత ఖర్చులతో అట్టహాసంగా జరిపించి అందరిచేత అభినందనలు అందుకున్నారు. ఆదివాసీ గిరిజన తెగలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కోయ, కొలాం, మనె్నవార్ గిరిజనుల్లో పెళ్ళిళ్ళకు ఖర్చులు తడిసిమోపెడవుతున్న నేపథ్యంలో పెళ్ళిళ్ళకు సిద్ధంగా ఉన్న 58 జంటలను ఒకే వేదికపై తీసుకవచ్చి సామూహిక వివాహాలు జరిపించగా, ఆదివాసీ గిరిజన గ్రామాలన్నీ అక్కడికి తరలివచ్చి ఆశీస్సులతో దీవెనలందించారు. ఆదివాసీలు సంప్రదాయ రీతిలో సంబరంగా జరుపుకునే ఈ పెళ్ళివేడుకలో డోలు వాయిద్యాలు, డప్పుల చప్పుళ్ళతో మార్మోగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న నూతన జంటలను ఆశీర్వదించడమే గాక ఎమ్మెల్యే ఉదార స్వభావాన్ని మనసారా కొనియాడారు. 119 మంది ఎమ్మెల్యేలలో సేవాదృక్పథం కలిగి ఉన్న నెంబర్‌వన్ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప అని కొనియాడారు. గర్భిణీలకు రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందిస్తూ పేద విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనం తన సొంతఖర్చులతో అందించడం అభినందనీయమని, ఇదే కోవలో ఆదివాసీ పేద కుటుంబాలకు అండగా 58 జంటలకు పెళ్ళిళ్లు జరిపి తాళిబొట్టు, కాలిమెట్టలు, వంట పాత్రలు, వస్త్రాలు అందజేసి కుటుంబాలకు పెద్దన్నగా వ్యవహరించారని ప్రశంసించారు. తనవంతుగా నూతన జంటలకు పెళ్ళిఖర్చుల కింద రూ.లక్షా 116 అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రాణహిత తీరంలో అట్టహాసంగా జరిగిన సామూహిక వివాహాలకు తాను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని, నూతన వధూవరులకు కల్యాణలక్ష్మి పథకం కింద చెక్కులు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఐటిడిఏ చైర్మెన్ కనక లక్కెరావు, ఎమ్మెల్యే కోనప్ప సతీమణి రమాదేవి, ట్రస్టు నిర్వహకులు వంశి, కృష్ణ పాల్గొన్నారు.

చిత్రాలు....సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలు, నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న మంత్రి జోగురామన్న