తెలంగాణ

రైతాంగాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 30: సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీజేఎసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హల్‌లో రైతు సమస్యలు పరిష్కారానికి ఉమ్మడి జిల్లా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయంలో పెట్టుబడి బాగా పెరిగిందని ముఖ్యం గా ప్రైవేటు వ్యక్తుల నుండి వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు బాధాకరమన్నారు. వ్యవసాయం మానవ కల్పితం వల్లే కుంటుపడిందని ప్రకృతి వల్ల కాదని అన్నారు.
31, ఫిబ్రవరి 1 తేదీల్లో రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లో పర్యటించి రైతు సమస్యలపై పూర్తి అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఏ విధంగా చేయూతను ఇస్తుందో అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా చేయూతను ఇవ్వాలని అన్నారు. దళారులు, దోపిడీదారుల వల్ల రైతు లు పండించిన పంటను దళారుల చేతుల్లోకి రావడంతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తక్షణమే ప్రభు త్వం జోక్యం చేసుకుని రైతుదోపిడీని అరికట్టాలని అన్నారు.
రైతును కాపాడితేనే మన ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుందని అన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో రాష్టస్థ్రాయి ముగింపుసభలో రైతు సమస్యలు, పరిష్కారానికి నిర్వహించే సమావేశంలో రైతుబాంధవులు, వ్యవసాయరైతులు ఈ సమావేశానికి హజరుకావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం జేఏసీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు బాల్‌కిషన్, చంద్రనాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టీ జేఏసీ చైర్మన్ కోదండరాం