తెలంగాణ

అడవుల విధ్వంసంపై హైకోర్టు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జకారం ప్రాంతంలో రిజర్వు అడవుల విధ్వంసంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు కూడా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మహమ్మద్ యాకూబ్ అనే వ్యక్తి అడవుల విధ్వంసంపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసు విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ప్రాంతంలో దేవతల గుట్ట వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు ఎన్ రాంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించి పై ఆదేశాలు జారీ చేసింది.
నేరగాళ్ల కోసం సమగ్రసర్వే నివేదిక ఇవ్వండి
డిజిపిని ఆదేశించిన హైకోర్టు
తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్రంలో నేరగాళ్ల కోసం నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలు అందించాలని హైకోర్టు తెలంగాణ డిజిపిని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి జారీ చేశారు. కల్వకుర్తికి చెందిన అబ్దుల్ హఫీజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి విచారించారు. ఈ నివేదికను వారం రోజుల్లోగా ఇవ్వాలని హైకోర్టు డిజిపిని ఆదేశించింది.