తెలంగాణ

ఇంటి పార్టీలోకి అడ్వకేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ ఇంటి పార్టీలోకి మంగళవారం పెద్ద సంఖ్యలో అడ్వకేట్లు చేరారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అడ్వకేట్ ఉమామహేశ్వర రావు నేతృత్వంలో సుమారు వంద మంది అడ్వకేట్లు పార్టీలో చేరారు. డాక్టర్ చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు ప్రసంగిస్తూ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలనగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సి ఉందని, ఇందుకు అడ్వకేట్లు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అడ్వకేట్లు న్యాయ స్థానాల్లో ఛాలెంజ్ చేయాలని ఆయన కోరారు.