తెలంగాణ

జంబ్లింగ్‌పై మాట మార్చిన బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను సైతం జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని గత పదేళ్ల నుండి చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి కూడా ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్ నుండి మినహాయించింది. ప్రయోగపరీక్షల నిర్వహణలో లోటుపాట్లను సరిదిద్దుకున్న ఇంటర్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా, జంబ్లింగ్ విధానం అమలు చేయకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 4 విడతలుగా ఫిబ్రవరి 21 వరకూ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 1632 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,66,364 మంది ఎంపిసి, 91,745 మంది బైపిసి, 422 మంది జాగ్రఫీ, 74, 949 మంది ఒకేషనల్ విద్యార్ధులు ప్రయోగ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 6,410 మంది లెక్చరర్లను ఎంపిక చేశారు. డిపార్టుమెంటల్ ఆఫీసర్లను కూడా నియమించామని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, హైపవర్ కమిటీలు, జిల్లా పరీక్షల కమిటీల ఏర్పాటు పూర్తయిందని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌లో పంపుతామని, అలాగే మార్కులను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. దీనివల్ల అక్రమాలకు తావుండదని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్ పరీక్షలను జంబ్లింగ్‌లో నిర్వహిస్తామని చెప్పిన బోర్డు అధికారులు నేడు జంబ్లింగ్ విధానం ఎందుకు పాటించడం లేదని గిరిజన విద్యార్ధి ఫెడరేషన్ అధ్యక్షుడు భూక్యా చందునాయక్, ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్‌లు ప్రశ్నించారు. విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలు కోసం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని, కాని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులిస్తే ప్రాక్టికల్స్ చేయకపోయినా మార్కులు వేసే ఆచారం ఉందని, అధిక డబ్బులు స్తే ఎక్కువ మార్కులు వేస్తామని విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి, చివరికి జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించడం లేదని, దీనికి కారణం కార్పొరేట్ కాలేజీలకు లొంగిపోవడమేనని వారు ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.
చైతన్య విద్యాసంస్థలకు ఏషియన్ అవార్డు
భారత విద్యారంగం దిగ్గజం శ్రీ చైతన్య విద్యాసంస్థలకు ఏషియన్ గ్రేటెస్టు బ్రాండ్స్-2017 అవార్డు దక్కింది. అవార్డును సంస్థ చైర్మన్ డాక్టర్ బి ఎస్ రావు, డైరెక్టర్ సుష్మ అందుకున్నారు. 29వ తేదీన సింగపూర్‌లో ఏషియావన్ మేగజైన్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవార్డు తమ సంస్థ అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవంగా డాక్టర్ బిఎస్ రావు వ్యాఖ్యానించారు.