తెలంగాణ

గంటల తరబడి ట్రాఫిక్ తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, జనవరి 31: పదివేల మంది పోలీసులు..్భరీ సంఖ్యలో అధికారులు..వీరికి తోడు ఆధునిక టెక్నాలజీ వినియోగం.. అయినా మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు యంత్రాంగం మొదటి రోజే విఫలమయింది. సమస్య తీవ్రతను గమనించి జాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సాక్షాత్తూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ములుగు ప్రాంతంలో, మేడారంలో పోలీసు బాస్ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్-మేడారం మధ్య భక్తుల రాకపోకలకు నాలుగు గంటల నుండి పది గంటల సమయం పట్టింది. ట్రాఫిక్ సమస్య అసలే ఉండదని అటు మంత్రులు, ఇటు పోలీసు అధికారులు పదేపదే చెప్పినా వాస్తవానికి వచ్చేసరికి వారి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గతంలో మాదిరిగానే ఈసారి భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మేడారం జాతరకు బందోబస్తు కోసం నియమించారు. దీనికి తోడు క్రౌడ్ కంట్రోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు కూడా చేశారు. అంతా బాగానే ఉన్నా జాతర ప్రారంభం అవకముందే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు కన్నీళ్లను తెప్పించాయి. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నానా తిప్పలు పడవలసి వచ్చింది. రాత్రి తొమ్మిదింటికి మేడారం నుండి బయలుదేరితే ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు హన్మకొండకు చేరుకోవడాన్ని గమనిస్తే ట్రాఫిక్ సమస్య ఏమేరకు ఏర్పడిందో అర్థం అవుతోంది. బుధవారం ఉదయం నుంచే సారలమ్మ దర్శనం కోసం వివిధ ప్రాంతాలనుంచి భారీ ఎత్తున ప్రజలు మేడారానికి తరలేందుకు బయలుదేరగా ట్రాఫిక్ జామ్‌ల పుణ్యాన అడుగడుగునా వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది. గట్టమ్మ దేవాలయం వద్ద, ములుగు పట్టణ శివారులలో, జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద, చల్వాయి సమీపంలో, నార్లాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద పలుమార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనాలు ఎక్కడికక్కడ గంటలతరబడి నిలిచిపోయాయి. ములుగు ప్రాంతంలో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులకు సకాలంలో వైద్యం అందించలేక మృతిచెందారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు చెందిన కళాబాయి అనే మహిళకు ఏటూరునాగారంలో ప్రసవం జరిగిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురి అయిన కారణంగా ఆమెను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని మార్గమధ్యంలో మృతిచెందింది. ట్రాఫిక్ జామ్‌తో హన్మకొండ వెళ్లవలసిన ఆర్టీసీ బస్సులు చాలా సమయం ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఒక సందర్భంలో హన్మకొండ నుండి భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు కొంత ఇబ్బంది పడవలసివచ్చింది. సమస్య తీవ్రతను గమనించిన డీజీపీ మహేందర్‌రెడ్డి హుటాహుటిన మేడారానికి చేరుకుని పోలీసు అధికారులతో సమీక్ష జరపవలసి వచ్చింది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ నుండి బయలుదేరి మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ సమస్యపై ఆరా తీస్తూ అధికారులకు సూచనలు చేస్తూ వచ్చారు.
అనుభవం లేని అధికారుల కారణంగానేనా...?!
మేడారం జాతరలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో జాతర అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించిన కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత రెండు మూడు జాతరలలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌తోపాటు ఇతర జిల్లాలలో విధులు నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు బాహాటంగానే అంటున్నారు. జాతరలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ముందస్తు సమీక్షలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు గత జాతరలో పనిచేసిన అధికారుల సేవలు ఉపయోగించుకోవాలనే ఆలోచనకు రాకపోవడం సమస్య తీవ్రతరం కావడానికి దారితీసింది.