తెలంగాణ

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: నేషనరల్ టౌన్ కంట్రీ ప్లానర్స్ కాంగ్రెస్ (ఐటిపిఐ) మహాసభలు ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు మూడురోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ డిఎస్ మేష్రామ్ తెలిపారు. నగర పర్యావరణ ప్రణాళికలు, పరిణామాలు, సవాళ్లు, నగరీ కరణ వల్ల ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లు, పర్యావరణం, అభివృద్ధి ప్రణాళికలు, అర్బన్ ఫ్లడింగ్ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. భారతదేశంలో సగానికిపైగా ప్రజలు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారన్నారు. 2011లో నగరాల్లో 31 శాతం మంది ప్రజలు ఉన్నారని, 50 శాతానికి చేరడం వల్ల ఎదురయ్యే సవాళ్లను చర్చిస్తామన్నారు. తీవ్రమైన వర్షపాతం, కరవు, వేడిగాలులు మొదలై దుష్ప్రరిణామాల ప్రభావం నగరీకరణపై ఎలా ఉంటుందో చర్చిస్తామన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, మహారాష్టల్రో కరవు, బీహార్, ఒరిస్సాలో వరదల ప్రభావంపై చర్చిస్తామన్నారు. అర్బన్ ఫ్లడింగ్‌పై దృష్టిని కేంద్రీకరించే సమయం ఆసన్నమైందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయాలన్నారు. ఐటిపిఐ చైర్మన్ ఎస్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధిని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రకృతి, మానవ కల్పిత సమస్యలను ఎదుర్కొనేందుకు అనేక పరిష్కారాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు.