తెలంగాణ

ప్రభుత్వ పథకాలతో రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతుల ఆదాయం పెరుగుతోందని, 2022 నాటికి ఈ ఆదాయం రెట్టింపు అవుతుందని మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో మార్కెటింగ్ పరిస్థితిపై అధ్యయనం చేసి వచ్చిన అధికారుల బృందంతో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. ఆ యా రాష్ట్రాల్లో పరిస్థితిపై వారు మంత్రికి వివరించారు. అధికారులు సమర్పించిన అధ్యయన నివేదికను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు అందిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. వ్యవసాయ పనులు ప్రారంభం నుండి పంట చేతికి వచ్చే వరకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు. పంటల కొనుగోలుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకన్నా అగ్రగామిగా ఉందన్నారు. తాజాకూరగాయలతో నడుపుతున్న మన కూరగాయలు ఔట్‌లెట్ల సంఖ్య 100 కు పెంచాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.