తెలంగాణ

కందులపై కేంద్రానికి మరో లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలంటూ కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీష్‌రావు మరొక లేఖ రాశారు. గత నెలలో ఆయన కేంద్ర మార్కెటింగ్ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణలో 2.84 లక్షల టన్నుల కందులు ఉత్పత్తి అవుతున్నాయని, ఇందులో 1.50 లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రప్రభుత్వం 53,600 టన్నుల కందుల సేకరణకు మొదట అంగీకరించిందని, ఇది సరిపోదన్నారు. హరీష్‌రావు గత నెలలో రాసిన లేఖకు స్పందించిన కేంద్రం 1,13,600 టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు అంగీకరించిందన్నారు. ఈ పరిమితి కూడా చాలదని, మొత్తం 1.50 లక్షల టన్నులలు కొనుగోలు చేయాలని తాజాగా ఆయన కోరారు. కందుల కొనుగోళ్లపై నిఘాపెట్టాలని, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.