తెలంగాణ

తెలుగు నిర్బంధ అమలు సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ అమలుచేయాలని ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నా, అది ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్నాటకలో కన్నడ తప్పనిసరి చేయడంతో అక్కడ ఉన్న యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ప్రధానంగా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ పాఠశాలలు స్థానిక ప్రాంతీయ భాషను తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఫస్టు లాంగ్వేజి, సెకండ్ లాంగ్వేజి సైతం ఇంగ్లీషు భాషను ఎంచుకుంటున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజిగా సంస్కృతం లేదా విదేశీ భాషను ఎంచుకుంటున్నారు. ఫస్టు లాంగ్వేజిగా ఇంగ్లీషు కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతీయ భాషల్లో చదవుకున్న వారంతా తెలుగు భాషకు మారడమేగాక, తొందరగా భాషను అర్ధం చేసుకుని చదువుకునేందుకు వీలుగా వివిధ స్థాయిల్లో తెలుగు మీడియం విద్యార్ధులకు వేరుగా, ఇంగ్లీషు మీడియం విద్యార్ధులకు వేరుగా తెలుగు పుస్తకాలను తయారుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే కొంతకాలం పాటు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ అస్సలు తెలుగు రాని వారి కోసం వేరుగా పుస్తకాలను రూపొందిస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు జనరంజకంగా ఉండేలా చూడాలని ఇప్పటికే డిప్యుటీ సిఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రస్తుతం సంస్కృతం భాషను చూస్తున్నట్టు తెలుగు భాషను కూడా స్కోరింగ్ సబ్జెక్టుగా మలచాలని, దాని వల్ల విద్యార్థులు వేరే ఇతర భాషలను తీసుకునే బదులు తెలుగు భాషకు ఆసక్తి చూపుతారనే భావన వ్యక్తమవుతోంది. తెలుగు భాష అమలుకు సంబంధించి గత వారం డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అన్ని స్థాయిల్లో విద్యార్ధులకు ఇబ్బంది కలుగని రీతిలో తెలుగు భాషను ఆసక్తికరంగా, స్కోరింగ్ సబ్జెక్టుగా తీర్చిదిద్దాలని అన్నారు. తెలుగు భాష తప్పనిసరి అమలుచేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి ఈ సమీక్ష చేశారు.
తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేస్తున్న విధానాన్ని అనుసరించి సిబిఎస్‌ఇ , ఐసిఎస్‌ఇ బోర్డులలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేయడంపై సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరిగా అమలుచేస్తున్న తీరుపై సబ్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా, ఐదో తరగతి వరకూ తెలుగు భాషను చదువుకోని వారికి ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్ధతిలో సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నామని అన్నారు. అదే విధంగా ఏడో తరగతి వరకూ తెలుగు చదువుకోని వారికి, ఎనిమిది, పదో తరగతి వరకూ తెలుగు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేందుకు వేర్వేరుగా పుస్తకాలను రూపొందిస్తున్నామని అన్నారు. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బోర్డులలో కూడా తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్పారని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మార్చడంలో అది విద్యార్థులకు ఆసక్తికరంగా అభివృద్ధి చేయడంతో పాటు స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలుగు సబ్జెక్టుకు సిలబస్, పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాలని కడియం శ్రీహరి సూచించారు