తెలంగాణ

పర్యావరణ అనుమతులకు చేరువలో ‘్ఫర్మా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల మంజూరు వేగవంతమైంది. ఫార్మాసిటీకి సంబంధించి అదనపు సమాచారాన్ని వెంటనే పంపించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఈ ఫార్మాసిటీకి సంబంధించి పర్యావరణ మేనేజిమెంట్, పరిరక్షణ సమాచారాన్ని వెంటనే పంపించాల్సిందిగా కోరింది.
ఢిల్లీలో పర్యావరణ అప్రైజల్ కమిటీ (ఇఏసి) 183వ సమావేశం జరిగింది. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు సంబంధించి 14 నివేదికలు కావాలని కోరింది. రంగారెడ్డి జిల్లా కందకూరు, యాచారం, కడ్తాల్ మండలంలో 19333 ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.16,784 కోట్ల వ్యయమవుతుంది. ఈప్రాజెక్టు పూర్తయిన తర్వాత పర్యవేక్షణ ప్రణాళిక, పర్యావరణ, జీవవైవిధ్య యాజమాన్యం, జల సంరక్షణ ప్రణాళిక, రసాయనిక పదార్థాలు, నిల్వపై రిస్క్ మేనేజిమెంట్ కోణంలో అధ్యయనం, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది. ప్రతి ఫార్మా ప్లాంట్‌కు సొంతంగా వ్యర్థ పదార్థాల శుద్ధి కేంద్రం ఉండాలని, జీరో లిక్విడ్ డిశ్చార్చ్ సదుపాయం ఉండాలని గతంలోనే కేంద్రం కోరింది. గత ఏడాది నవంబర్‌లోనే ఫార్మాసిటీ పబ్లిక్ హియరింగ్ పూర్తయింది. స్థానికులు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారు. భూసేకరణకు సంబంధించి కూడా సంపూర్ణ సమాచారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ కేంద్రానికి పంపింది.
కాగా జహీరాబాద్ వద్ద ప్రతిపాదించిన నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఇకపై పర్యావరణ ప్రభావం అంచనాలు, పర్యావరణ యాజమాన్య ప్రణాళికను అధ్యయనం చేసి నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.