తెలంగాణ

ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం వారిరువురూ మీడియాతో కొంతసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. నియోజకవర్గాలపై వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి పునర్విభజన సాధ్యం కాదని అనుకుంటున్నామని వారు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇతర భావసారూప్యం గల పార్టీలను కలుపుకుని పోవడం సర్వసాధారణమేనని, ఆ విధంగా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తామని అన్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు కాబట్టి లోతుగా వివరాలు ఏమీ చెప్పలేమని వారు తెలిపారు. టిఆర్‌ఎస్ 102 స్థానాలు గెలుస్తాం అని చెప్పడం వెనక మతలబు కాంగ్రెస్ శ్రేణులను మానసికంగా బలహీనపరచాలనుకోవడమేనని అన్నారు. మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, సైన్యం కౌరవుల వద్దే ఉన్నా, చివరకు పాండవులే గెలుపొందారని వారు ఉదహరించారు. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందని భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లోనే రైతులు రెండో పంట వేశారని వారు తెలిపారు. ఇందులో 62 శాతం రైతులు 2.5 ఎకరాలలోపు ఉన్న వారేనని అన్నారు. మెజారిటీ రైతులకు రెండు నుంచి మూడు వేల లోపే పెట్టుబడి సాయం అందుతున్నదని వారు తెలిపారు. అదే గిట్టుబాటు ధర, బోనస్ కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు క్వింటాలుకు రూ.100 తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం వారికి సమానమే అవుతుందని తెలిపారు.
రేవంత్ రాజీనామాకు సిద్ధమే..
తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని జానారెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే రేవంత్‌కు ముందు రాజీనామా చేసిన వాటినే స్పీకర్ ఇంకా ఆమోదించలేదని ఆయన గుర్తు చేశారు. ముందు ఇచ్చిన వాటిని ఆమోదిస్తే రేవంత్ వెంటనే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారని జానారెడ్డి తెలిపారు.