తెలంగాణ

హరీశ్ నేతృత్వంలో ఢిల్లీకి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి ఆయా ప్రాజెక్టులపై ఏపీనుంచి వస్తున్న అభ్యంతరాలను గట్టిగా ఎదరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో తన వాటాను రాబట్టుకోడానికి, తమ వాదనను గట్టిగా విన్పించడానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ నేతృత్వంతో రాజధానికి ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఓ బృందం వెళ్లాలని అభిప్రాయపడింది. వరంగల్‌లో వెటర్నరీ, వ్యవసాయ యూనివర్శిటీల ఏర్పాటు, మెదక్ జిల్లాలో నిమ్స్, ఫిషరీస్ వర్సిటీ, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పనులకు టెండర్లు, ప్రాజెక్టు పనుల్లో స్థానికులకు ప్రాధాన్యం, అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు ఇవ్వడంవంటి పలు నిర్ణయాలకు కేబినెట్ ఓకే చెప్పింది.