తెలంగాణ

తెలంగాణలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని, ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉగ్రవాదులు హైదరాబాద్, వరంగల్ నగరాలపై దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని, తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాలని ఆయన పోలీసు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల ప్రాబల్యం గల ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదనపు బలగాలతో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో అనుమానితులపై నిఘా వేసి, మాజీ నక్సలైట్లు ఎక్కడున్నారు..ఏ ప్రాంతంలో ఉన్నారు.
వారు చేస్తున్న పనేంటి అనే వాటిపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ పోలీసులతోపాటు ఛత్తీస్‌ఘడ్, బిఎస్‌ఎఫ్ కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్‌తో తనిఖీలు చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాజీ నక్సలైట్లను ముందు నడిపిస్తూ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాల, చందంపల్లి, కాళేశ్వరం, ధర్మపురి అటవీ ప్రాంతంలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించినా, అనుమానితులు ఎవరైనా కనిపించిన వారి కదలికల పట్ల నిఘా వేసి ఉంచాలని పోలీసులు స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు. జిల్లాల్లో ఎస్పీల ఆదేశానుసారం డిఎస్పీలు, సర్కిల్ ఇనె్స్పక్టర్లు, అదనపు పోలీసు బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. శివరాత్రి కావడంతో ఆలయాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సహా ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు సిసి టివి కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

డాక్టర్ల కాల్పుల కేసు సిసిఎస్‌కు బదిలీ

ప్రైవేటు ఏజెన్సీతో విచారణ: శశికుమార్ భార్య డిమాండ్

హైదరాబాద్, మార్చి 7: నగరంలోని హిమాయత్‌నగర్‌లో సంచలనం రేపిన వైద్యుల మధ్య కాల్పుల కేసు సిసిఎస్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయింది. గత నెల 8న ముగ్గురు డాక్టర్ల మధ్య ఆసుపత్రిలో భాగస్వామ్యంపై తలెత్తిన వివాదంతో ఓ డాక్టర్‌పై మరో డాక్టర్ కాల్పులు జరిపిన సంఘటన, మరుసటి రోజే డాక్టర్ శశికుమార్ మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఓ ఆసుపత్రిలో ముగ్గురు భాగస్వాములైన సాయికుమార్, ఉదయ్‌కుమార్, శశికుమార్‌ల మధ్య ఆసుపత్రి సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవులపై ఆధిపత్య పోరుతో డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. గాయపడిన డాక్టర్ ఉదయ్‌కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సాయికుమార్ పరారయ్యాడు.
శశికుమార్ మాత్రం డాక్టర్ ఉదయ్ కుమార్ మృతి చెందాడనుకొని తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనపై సెంట్రల్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు కేసును దర్యాప్తు జరుపుతుండగా, శశికుమార్ ఆత్మహత్య కేసును రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శశికుమార్ భార్య శాలిని తన భర్త ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. తన భర్త కేసు దర్యాప్తులో జాప్యం జరిగిందని, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఓ ప్రైవేటు ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.
దీంతో విచారణలో ఉన్న వైద్యుల కాల్పుల కేసును ఉభయ కమిషనరేట్లకు చెందిన పోలీసులు కేసును సిసిఎస్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్లకు చెందిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలావుండగా డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని దర్యాప్తులో తేలిందని గతంలోనే సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ఈ కేసు రంగారెడ్డి జిల్లా పరిధిలోనిదని, అక్కడి పోలీసులు సిసిఎస్‌కు బదిలీ చేయడంతో ఈ కేసును హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు సిసిఎస్ ఎస్పీ, డిసిపి ప్రభాకర్‌రావు తెలిపారు.

ఉద్దేశపూర్వకంగానే సుశీల్‌పై ‘నిర్భయ’

దళిత సంఘాల ఆరోపణ కంటతడి పెట్టిన డ్రైవర్ రమేశ్ తల్లిదండ్రులు
హైదరాబాద్/ముషీరాబాద్, మార్చి 7: ఎపి రాష్ట్ర మంత్రి రావెల్ కిషోర్ బాబు తనయుడు సుశీల్‌పై ఉద్దేశపూర్వకంగానే నిర్భయ కేసు నమోదు చేసి కేసును తప్పుదారి పట్టించారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. నిజంగా సుశీల్ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదనీ, కానీ సుశీల్‌పై దాడికి పాల్పడిన వారిని నేటికీ అరెస్టు చేయకపోవటం, పోలీసులు వెల్లడిస్తున్న కథనాలు, సిసి ఫుటేజిలోని దృశ్యాలు ఆనుమానాలకు తావిస్తున్నాయని వారు పేర్కొన్నారు. సోమవారం విలేఖరుల సమావేశంలో తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మేరి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు సుంకపాక దేవయ్య మాదిగ, పాపయ్య మాదిగ, దేవని సతీష్ మాదిగ, గద్ద శ్రీనివాస్ మంత్రి రావెల డ్రైవర్ రమేశ్ తల్లిదండ్రులు మల్లేశ్, రాణి, సోదరి మమతతో కలిసి మాట్లాడారు. 3రోజులాగే డ్యూటీకి వెళ్లిన మాకొడుకు జాడ నేటికీ తెలియడం లేదు.. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో తెలియదు. పోలీస్‌స్టేషన్‌కెళ్తే లోపలకు కూడా రానీయటం లేదు.. మాబాబును మాకు అప్పగించాలి2 అంటూ మీడియా ఎదుట రమేశ్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ సుశీల్‌పై దాడికి పాల్పడిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టం కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విడుదల చేసిన సిసిటివి ఫుటేజిలో ఎక్కడా టీచర్‌పై చేయి చేసుకున్నట్లు, మాట్లాడినట్లు దాఖలాలు లేవని అన్నారు. ప్రైవేట్ టీచర్ చెప్పే ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అసలు బురఖాలో ఉన్నది మహిళా?, పురుషుడా అనే అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ కమలనాథుడెవరు?

రామచంద్రుడా? లక్ష్మీ నారాయణుడా? పదవిపై లక్ష్మణ్ అయిష్టత

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 7: బిజెపి తెలంగాణ శాఖ నూతన సారథి ఎంపికకు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ అధిష్టానం మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కృష్ణదాస్ ఆది, సోమవారాల్లో పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల, ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. యెండలకు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించడం ద్వారా బిసికి ఇచ్చినట్లు అవుతుందని కొంతమంది అంటున్నారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన రామచందర్‌రావుకు ఇవ్వాలని మరి కొంతమంది సూచించినట్లు సమాచారం. రామచందర్‌రావుకు జాతీయ పార్టీ నాయకులైన నితీన్ గడ్కరీ, జైట్లీ ప్రభృతుల మద్దతు ఉంది.
ఇలాఉండగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడైన డాక్టర్ కె. లక్ష్మణ్‌కు పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించి, ఆ పదవిని ప్రస్తుత అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డికి అప్పగించడం ద్వారా తలనొప్పి లేకుండా పని తేలిక అవుతుందని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనసభాపక్షం నాయకునిగా తన సంతృప్తిగా ఉన్నానని, ముళ్ళకిరీటం లాంటి అధ్యక్ష పదవి తనకు ఎందుకని లక్ష్మణ్ అభిప్రాయపడుతున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, జాతీయ స్థాయిలో ఉన్న నేత రాష్ట్ర స్థాయికి ఎందుకు వస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
ఇలాఉండగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కృష్ణదాస్ ఆదివారం, సోమవారం పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాకు ఆయన నివేదిక అందించనున్నారు. కృష్ణదాస్‌ను కలిసిన అనేక మంది నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి. మురళీధర్ రావు పేరును కొంత మంది ప్రతిపాదించగా, మరి కొంత మంది పార్టీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పేరును, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పేరును, ఎమ్మెల్యే రామచందర్ రావు పేరును, మాజీ ఎమ్మెల్యే, బిజెపి మాజీ అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి పేరును సూచించారు. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు నుంచి కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి ఎన్నికయ్యే అవకాశం లేదని పార్టీ నాయకులు అంటున్నారు. కిషన్‌రెడ్డి కూడా ఇక తాను కొనసాగనని, కొత్త వారికి అవకాశం ఇవ్వడమే మంచిదని చెబుతున్నారు.