రాష్ట్రీయం

టిటిడికి 8టన్నుల కూరగాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: సమాజంలో ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి 8 టన్నుల కూరగాయలు పంపుతున్న ఏసి వాహనాన్ని ముఖ్యమంత్రి తొలిసారి విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవ కుటుంబరావు, కాశీ అన్నపూర్ణ దంపతులు నలుగురికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
కుటుంబరావు రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందించారని, అదేకాకుండా 2007 నుంచి ఇప్పటి వరకు 1500 టన్నుల మేర కూరగాయలు తిరుమలకు వితరణగా అందజేశారన్నారు. ప్రతిఒక్కరూ సమాజ సేవలో తమవంతు పాత్ర తప్పక పోషించాలని కోరారు. తమిళనాడుకు చెందిన ముస్లిం అబ్దుల్ ఘనీ ఎసి వాహనాన్ని వితరణగా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యుడు బోడే ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.