ఆంధ్రప్రదేశ్‌

సాక్ష్యాలున్నందునే తుని ఘటనలో అరెస్టులు: సిఐడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిందితులకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయని సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధమైనపుడు వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని వారు తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన దూడల మణీంద్ర అమలాపురంలో రౌడీషీటర్ అని సీఐడీ తేల్చింది. 2015లో అమలాపురంలో హత్యాయత్నం కేసులో నిందితుడని స్పష్టం చేసింది. 2012లో జరిగిన హత్య కేసులో, 2009లో అధికారులపై దాడి కేసులో దొరబాబు నిందితుడని వెల్లడించింది. గుంటూరుకు చెందిన లక్కింశెట్టి శివ, పవన్‌కుమార్ తుని ఘటనాస్థలంలో విలేకరి సెల్‌ఫోన్ లాక్కున్నారన్నారని స్పష్టం చేసింది. వీరి నుంచి సెల్‌ఫోన్ రికవరీ చేశామని సీఐడీ తెలిపింది.