కరీంనగర్

ఉపాధి వేటలో గల్ఫ్‌కు.. శవపేటికలో ఇంటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, జనవరి 22: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ శివారులోని గొల్లపల్లికి చెందిన కొత్తకొండ కనుకరాజు(22) ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్ళగా అక్కడ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు నెలల తర్వాత శవపేటికలో ఇంటికి చేరుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన హన్మవ్వ, రామయ్యల ఏకైక కుమారుడు కనుకరాజు, ఉపాధి కోసం అప్పులు చేసి సౌదీకి వెళ్ళాడు. అక్కడ కారణాలు తెలియకుండానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడికి ఖబురు పంపారు. అయితే ప్రభుత్వం హత్యా, ఆత్మహత్యా అంటూ రెండున్నర నెలల పాటు విచారించి శవాన్ని శవపేటికలో ఇండియాకు పంపారు. శుక్రవారం ఇంటికి చేరుకోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శవాన్ని చూసిన అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వృద్ధ దంపతులైన హన్మయ్య, రామవ్వలకు ఒకటే కుమారుడు కావడంతో వారిని చూసేవారు కరువయ్యారు. ఇద్దరు బిడ్డలకు పెళ్ళిల్లై ఒక కుమార్తె పెళ్ళికి ఉండడంతో అలాగే బీద కుటుంబం కావడంతో గ్రామస్తులు సానుభూతి ప్రకటిస్తూ చేతనైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబాన్ని ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇవ్వాలని కొలనూరు సర్పంచ్ అబ్దుల్ రషీద్, మర్తనపేట సర్పంచ్ జవాజితిరుపతిగౌడ్, సెస్ మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, మంత్రి కెటిఆర్, ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేష్‌బాబులను కోరారు.