తెలంగాణ

ఊహల్లో టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఊహల్లో విహరిస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ తమను ఎంత విమర్శిస్తే అంత తమకే లాభమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. బిజెపి-తెలుగు దేశం పార్టీల అభ్యర్థుల విజయం కోసం తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని ఆయన తెలిపారు. రెండు పార్టీల నుంచి ఎక్కువ పోటీ వచ్చిన 10 డివిజన్లలో స్నేహపూర్వక పోటీ చేయాలని నిర్ణయించామని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ టిడిపితో ఇలా కొన్ని నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ చేశామని, ఇలా చేయడం కొత్తేమి కాదని ఆయన చెప్పారు. దీంతో భేదాభిప్రాయాలు ఏమీ లేవని, రెండు పార్టీల్లో ఎవరు గెలుపొందినా సంతోషమేనని అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. అయితే 26 నుంచి పలువురు కేంద్ర మంత్రులు ప్రచారానికి రానున్నారని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.