బిజినెస్

యుకె సిన్హా పదవీకాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యుకె సిన్హా పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 17తోనే సిన్హా పదవీ కాలం ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న కేబినెట్ నియామకాల కమిటీ.. సిన్హా పదవీ కాలాన్ని ఏడాదికిపైగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, సిన్హా హయాంలో సెబీ ఎన్నో సంస్కరణలను చేపట్టింది. సామాన్య మదుపరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసింది.