బిజినెస్

అండర్ ట్రయల్ ఖైదీల కోసం ‘న్యాయ భారతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.10 కోట్లతో ప్రారంభించనున్న భారతీ * సునీల్ మిట్టల్ విరాళం రూ.5 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 26: జీవితంలో తొలిసారి చిన్నచిన్న నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు సహాయాన్ని అందించేందుకు ప్రముఖ సంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్ ‘న్యాయ భారతి’ పేరుతో త్వరలో న్యాయ సేవా సంస్థను ప్రారంభించనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికామ్ సంస్థ ‘్భరతీ ఎయిర్‌టెల్’కు యజమానిగా వ్యవహరిస్తున్న భారతి ఎంటర్‌ప్రైజెస్ అధ్యక్షుడు సునీల్ భారతి తన వేతనం నుంచి 5 కోట్ల రూపాయల విరాళాన్ని ‘న్యాయ భారతి’కి అందజేయనున్నారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి 10 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభమయ్యే ‘న్యాయ భారతి’ జిల్లాస్థాయి కోర్టుల్లో బెయిళ్లు, హామీల కోసం అవసరమైన మొత్తాలను చెల్లించి అండర్ ట్రయల్ ఖైదీలకు సహాయాన్ని అందజేస్తుంది. తొలుత ఢిల్లీ-ఎన్‌సిఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో ప్రారంభమయ్యే ‘న్యాయ భారతి’ని మున్ముందు పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు విస్తరిస్తామని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ ప్రతి ఏటా ‘న్యాయ భారతి’కి 10 కోట్ల రూపాయలు అందజేస్తుందని, ఈ విరాళంలో సగం మొత్తాన్ని తన వేతనం నుంచే ఇవ్వడం జరుగుతుందని సునీల్ మిట్టల్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో సునీల్ మిట్టల్ రూ.27.17 కోట్ల వేతనాన్ని పొందారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన దాతృత్వ సంస్థ ‘్భరతీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పనిచేసే న్యాయ భారతి ప్రత్యేక పాలక మండలిని కలిగి ఉంటుందని సునీల్ మిట్టల్ తెలిపారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్.ఆనంద్ అధ్యక్షతన 12 మందితో ఏర్పాటయ్యే న్యాయ భారతి పాలక మండలిలో తాను, తన సోదరుడు రాకేష్ భారతి మిట్టల్‌తో పాటు మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ ఎన్.సాల్వే, సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ బారు తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు.