రాష్ట్రీయం

వివాదాల్లేని 8,806 డిఎస్సీ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఎలాంటి న్యాయ వివాదాలు లేని 8,086 డిఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి డిఎస్సీ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్న తరుణంలో న్యాయవివాదాలకు అవకాశం లేకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ సచివాలయంలో మంత్రి చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. యుకెలో తాను పాల్గొన్న ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరమ్-2016 విశేషాలను మంత్రి గంటా వివరించారు. అక్షరాస్యత, నైపుణ్యాల అభివృద్ధి, వృత్తి విద్య, ప్రాథమిక అవగాహన అనే అంశాలపై చర్చించామని తెలిపారు. పరస్పర అవగాహనకు, భాగస్వామ్యానికి తద్వారా ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగ అభివృద్ధికి ఈ ఫోరమ్ వేదికగా నిలిచిందని అన్నారు. నాణ్యమైన బోధన, బాల్యదశలోనే విద్య, భవిష్యత్తు విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి విధివిధానాలపై లోతైన చర్చ జరిగిందని అన్నారు. ఎన్జీవోల ద్వారా నడుపబడుతున్న ఆల్ సెయింట్స్ అకాడమిని సందర్శించినట్లు వివరించారు. అదే తరహాలో ఎపిలో కూడా కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి, అభివృద్ధి చేసేందుకు సిఎంతో చర్చిస్తామని అన్నారు. సరైన బోధనాపద్దతులను కల్పించడంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఒక మంచి ఉదాహరణ అని తమ పర్యటనలో తెలిసిందని అన్నారు. ఈ సంస్థతో వివిధ అంశాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్దం చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ సందర్శన వల్ల 21వ శతాబ్ధంలో బోధన, నేర్చుకోవడం వంటి అంశాల్లో నూతన పద్దతులను తెలుసుకోవడానికి దోహదపడిందని అన్నారు. ప్రినె్సస్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ లియోడ్ డార్ఫ్ మాన్, ప్రోగ్రామ్స్ డైరక్టర్ కెయిట్లిన్ కెనడితో సమావేశమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎపిని సందర్శించాలని, పలు ఎంఓయులు చేసుకునేందుకు రావాలని వారిని ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి తన లండన్ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. అలాగే 2017లో ఏషియన్ విద్యామంత్రుల సదస్సును ఎపిలో నిర్వహించేందుకు అంగీకరించారని, విశాఖ గానీ లేదా మరెక్కడ నిర్వహించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలమపై ప్రెసిడెన్సియల్ ఆర్డర్స్ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నామని చెప్పారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎపి స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు.