రాష్ట్రీయం

విసిని తప్పించాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 23: సెంట్రల్ వర్శిటీ ప్రాంగణంలో దీక్షలు చేస్తున్న విద్యార్థులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. శనివారంనాడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు దీక్షాశిబిరాన్ని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి రోహిత్ మృతి బాధాకరమన్నారు. రోహిత్ మృతిపై విచారణ కమిటీ వేసినందున ముందుగా వర్శిటీ విసిని, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే వీరిని తప్పించాలన్నారు. రోహిత్ కుటుంబానికి 50లక్షల ఆర్థిక సహాయంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వర్శిటీలో జరుగుతున్న అరాచకాలను రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సిపిఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ యూనివర్శిటీల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టులాంటిదన్నారు. రోహిత్ ఆత్మహత్యపై సిఎం కెసిఆర్ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఒక విద్యావంతుడు చనిపోతే పాలక మండలి ఎనిమిది లక్షలు ప్రకటించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. కనీసం 50 లక్షలు పరిహారం ఇవ్వాలని, వర్శిటీ యాజమాన్యం ఇవ్వలేమంటే తాము జోలె పట్టి భిక్షమెత్తి రోహిత్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని సవాల్ చేశారు.
ఇందిరాపార్కు వద్ద దళిత సంఘాల ధర్నా
విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులను శిక్షించాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద శనివారం దళిత సంఘాలు, కులవివక్ష పోరాట సమితి, మేథావులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థుల పట్ల వివక్ష చూపే ఏ వర్శిటీలైనా మనుగడ సాధించలేవన్నారు. విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష తగదన్నారు.