తెలంగాణ

వారికి శృంగభంగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు విసిరిన ప్రతిపక్ష నేతలందరికీ శృంగభంగమైంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని భుజానికి ఎత్తుకు ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు గ్రేటర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ కైవసం చేసుకోవడమే కాకుండా వంద స్థానాల్లో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ టిఆర్‌ఎస్ వంద స్థానాలను గెలుచుకుంటే, తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టనని, రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలుచుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వీరితో పాటు సిపిఐ నాయకుడు నారాయణ అయితే ఏకంగా గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ పార్టీ వంద స్థానాలను గెలుచుకుంటే తన చెవి కోసుకుంటానని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. గ్రేటర్‌లో వీచిన టిఆర్‌ఎస్ ప్రభంజనంతో ప్రతిపక్ష నేతలందరికీ శృంగభంగం తప్పలేదు.